ఉద్యోగ ప్రకటన ఇచ్చిన 'వంటలక్క' ప్రేమీ విశ్వనాథ్

  • కార్తీకదీపం సీరియల్ తో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రేమీ విశ్వనాథ్
  • డ్రైవర్లు, అకౌంటెంట్ కావాలని ఉద్యోగ ప్రకటన
  • ఎంపికైన వారు ఎర్నాకులంలో పని చేయాలన్న వంటలక్క
బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ సందడి చేస్తోంది. 2017లో మొదలైన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. టీఆర్పీ రేటింగ్ లో కూడా ఈ సీరియల్ దూసుకుపోయింది. ఇండియన్ టెలివిజన్ రంగంలోనే తిరుగులేని టీఆర్పీని ఈ సీరియల్ సాధించింది. 

ఈ సీరియల్ కు వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్లు క్రేజ్ తీసుకొచ్చాయి. ఇక వంటలక్క పాత్రను కేరళకు చెందిన ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు క్యారెక్టర్ ను నిరుపమ్ పోషించారు. అయితే, ఈ సీరియల్ లో ఇటీవలే ఈ రెండు పాత్రలు రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. దీంతో, టాప్ రేటింగ్ లో కొనసాగిన ఈ సీరియల్... ఇప్పుడు కాస్త వెనుకబడిపోయింది. 

ఈ సీరియల్ గురించి పక్కన పెడితే... ప్రేమీ విశ్వనాథ్ ఒక ఉద్యోగ ప్రకటనను ఇచ్చింది. ఫేస్ బుక్ లో ఈ ప్రకటనను పోస్ట్ చేసింది. 'అన్ని రకాల ఫోర్ వీలర్ (ఆటోమేటిక్, మాన్యువల్) డ్రైవర్లు కావలెను' అని ఆమె పేర్కొంది. దీనికి తోడు ట్యాలీలో రెండేళ్ల అనుభవం ఉన్న అకౌంటెంట్ కావాలని చెప్పారు. ఎంపికైన వారు కొచ్చిలోని ఎర్నాకులంలో పని చేయాల్సి ఉంటుంది.

Premi Vishwanath
Karthika Deepam
Vantalakka
Job Notification

More Telugu News